ప్రశాంతంగా చదవండి: డీఈవో
ABN , Publish Date - Feb 26 , 2026 | 11:30 PM
విద్యార్థులు ప్రశాంతంగా ఏకాగ్రతతో ఈ పక్షం రోజులు కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని జిల్లా విద్యాశాఖాధికారి జనార్దన్‌రెడ్డి సూచించారు.
బండిఆత్మకూరు ఫిబ్రవరి26(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు ప్రశాంతంగా ఏకాగ్రతతో ఈ పక్షం రోజులు కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని జిల్లా విద్యాశాఖాధికారి జనార్దన్‌రెడ్డి సూచించారు. గురువారం ఉదయం బండిఆత్మకూరు కేజీబీవి పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా వంద రోజుల ప్రణాళికలో పాఠశాలలో 10 వతరగతి విద్యార్థినుల స్టడీ అవర్‌ను పరిశీలించారు. సీ, డీ గ్రేడ్‌లలో ఉన్న విద్యార్థునిలు ఏ, బీ గ్రూపులలోకి వచ్చేలా కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం అక్కడే విద్యార్థులతో కలసి డీఈవో అల్పాహారం తిన్నారు. వత్తిడి వీడి, పక్కా ప్రణాళికగా ప్రశాంతంతో చదివితే సులువుగా ఉత్తీర్ణత సాధించవచ్చని అన్నారు. 15 రోజులు కష్టపడి చదవాలని, ఇంటిపై బెంగ వీడాలని సూచించారు. పదో తరగతి పబ్లిక్ పరీక్ష పత్రాలు ఇప్పటికే స్టేషన్లకు చేరుతున్నాయని అన్నారు. పరీక్షా సమయంలో కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు.