Share News

గమ్యస్థానాలు సురక్షితంగా చేరుకోండి: ఎస్పీ

ABN , Publish Date - Mar 20 , 2026 | 12:00 AM

గమ్యస్థానాలను సురక్షితంగా చేరుకోవాలని ఎస్పీ సునీల్‌ షెరాన్‌ సూచించారు.

గమ్యస్థానాలు సురక్షితంగా చేరుకోండి: ఎస్పీ
కమాండ్‌ కంట్రోల్‌ రూం నుంచి పర్యవేక్షిస్తున్న ఎస్పీ

శ్రీశైలం, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): గమ్యస్థానాలను సురక్షితంగా చేరుకోవాలని ఎస్పీ సునీల్‌ షెరాన్‌ సూచించారు. ఉగాది పర్వదినం రోజున తెల్లవారుజాము నుంచి మల్లయ్య దంపతులను దర్శించుకుని సాయంత్రం ఆలయ మాడవీధిలో జరిగే రథోత్సవంలో స్వామి అమ్మవార్లను కనులారా వీక్షించుకుని తమతమ ప్రాంతాలకు తిరు గుపయనయ్యారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు సుమారు లక్ష మంది భక్తులకు పైగా ఒక్కసారిగా తిరుగు పయనమవ్వడంతో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా పోలీసులు ప్రణాళికాబద్ధమైన ఆంక్షలతో వాహనాలను బయటి దారులకు మళ్లించారు. వాహనదారులకు ఎస్పీ పలు సూచనలిచ్చారు. కమాండ్‌ కంట్రోల్‌ రూం నుంచి క్షేత్ర వలయ రహదారితోపాటు సాక్షి గణపతి, పాలధార పంచధార, ముఖద్వారం వరకు ట్రాఫిక్‌ నిలువకుండా పోలీస్‌ అధికారులు, సిబ్బందికి దిశ నిర్దేశం చేశారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన 1600 ఆర్టీసీ బస్సులు, తెలంగాణకు చెందిన 100 ఆర్టీసీ బస్సులు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 300 ఆర్టీసీ బస్సులు ఉండగా సుమారు 4000 వేల వరకు కార్లు, జీపులు, బొలేరో వాహనాలు క్షేత్రం నుంచి బయటకు భక్తులతో నిండుగా వెళ్లినట్లు అధికారుల అంచనా.

Updated Date - Mar 20 , 2026 | 12:00 AM