Share News

జీజీహెచ్‌లో అరుదైన శస్త్రచికిత్సలు

ABN , Publish Date - Nov 05 , 2026 | 12:17 AM

కర్నూలు జీజీహెచ్‌లో ఇద్దరు రోగులకు ఎన్టీఆర్‌ వైద్యసేవ కింద జనరల్‌ సర్జరీ రెండవ యూనిట్‌ వైద్యులు రెండు అరుదైన ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించారు.

జీజీహెచ్‌లో  అరుదైన శస్త్రచికిత్సలు
రోగులతో సర్జరీ వైద్యులు

కర్నూలు హాస్పిటల్‌, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): కర్నూలు జీజీహెచ్‌లో ఇద్దరు రోగులకు ఎన్టీఆర్‌ వైద్యసేవ కింద జనరల్‌ సర్జరీ రెండవ యూనిట్‌ వైద్యులు రెండు అరుదైన ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించారు. ఆదోనికి చెందిన 52 ఏళ్ల ఇక్బాల్‌ బాషాకు డయాఫ్రాగ్మాటిక్‌ విధానంలో అక్టోబరు 15న శస్త్ర చికిత్స నిర్వహించారు. రోడ్డు ప్రమాదం లో గాయపడి ప్లీహానికి తీవ్ర గాయం కావడంతో గూడూరుకి చెందిన 32 ఏళ్ల మాసూం మియాకు అక్టోబరు 1న ల్యాప్రోస్కోపిక్‌ స్ల్పీనెక్టమీ ఆపరేషన్‌ నిర్వహించారు. ఈ రెండు అరుదైన ఆపరేషన్లను జనరల్‌ సర్జరీ యూనిట్‌-2 చీఫ్‌ ప్రొఫెసర్‌ డా.రామకృష్ణ నాయక్‌ ఆధ్వర్యంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా.సబీరా, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు డా.ప్రణీత్‌, డా.ప్రశాంతి మత్తుమందు వైద్యులు, పీజీ వైద్యవిద్యార్థులు డా.మనోజ్‌, డా.తేజ, డా.ఆంచల్‌, డా.సోమశేఖర్‌ వైద్యబృందం నిర్వహించారు. సర్జరీ వైద్యులను సూపరింటెండెంట్‌ డా.కే.వెంకటేశ్వర్లు అభినందించారు. కేఎంసీ వైస్‌ ప్రిన్సిపాల్‌ డా.హరిచరణ్‌, అనస్తీషియా ప్రొఫెసర్‌ డా.రామశివనాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 05 , 2026 | 12:17 AM