శరవేగంగా గుర్రపు డెక్క తొలగింపు
ABN , Publish Date - Sep 30 , 2026 | 12:21 AM
కేసీ కెనాల్‌లో గుర్రపు డెక్క తొలగింపు పనులు శరవేగంగా చేపడుతున్నట్లు నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు.
నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు
కర్నూలు న్యూసిటీ, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): కేసీ కెనాల్‌లో గుర్రపు డెక్క తొలగింపు పనులు శరవేగంగా చేపడుతున్నట్లు నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. మంగళవారం స్టాంటానపురం, అశోక్‌నగర్, కేవీఆర్ కళాశాల, వినాయక ఘాట్, జొహ రాపురం వంతెనల ప్రాంతాల్లో జరుగుతున్న గుర్రపు డెక్క తొలగింపు పనులను కమిషనర్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ కేసీ కెనాల్‌లో నీటి ప్రవాహం లేనప్పుడే నగర పరిధిలో 90 శాతం గుర్రపు డెక్కను తొల గించామన్నారు. వంతెనల పిల్లర్ల వద్ద గుర్రపు డెక్క పేరుకుపోకుండా హైడ్రాలిక్ ఎక్స్‌వేటర్ ద్వారా తొలగిస్తున్నామన్నారు. ఎస్‌ఈ జే.రమణ మూర్తి, ఎంఈ గిరిరాజు, డీఈఈలు పవనకుమార్‌రెడ్డి, నరేష్, శ్రీనివాసన, కృష్ణలత, హేమలత, శానిటరీ ఇనస్పెక్టర్లు అనిల్, ఫరూక్ ఉన్నారు.