Share News

రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు

ABN , Publish Date - Sep 01 , 2026 | 11:07 PM

రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నామని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.

రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు
ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు పంపిణీ చేస్తున్న మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

బనగానపల్లె, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నామని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. మంగళవారం బనగానపల్లెలోని రంగరాజుపేటలో మంత్రి స్వ యంగా ఇంటింటికి తిరిగి ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ప్రజల బాగోగులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మంత్రి బీసీ మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ప్రతి నెల ఒకటో తేదీన క్రమం తప్పకుండా లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈనెల నుంచి కొత్తగా 6,288 మందికి స్పౌజ్‌ పింఛన్లు మంజూరు చేస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి పనిచేసే కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాలని మంత్రి పిలుపునిచ్చారు. టీడీపీ నాయకులు బురానుద్దీన్‌, టంగుటూరు శ్రీనయ్య, బండి మౌళీశ్వరరెడ్డి, కాశీంబాబు, అత్తార్‌ అబ్దుల్‌కలాం, సంగం శ్రీనివాసరెడ్డి, కూరగాయలశేఖర్‌, రాయలసీమ సలాం, అహమ్మద్‌ హుసేన్‌, మౌలాలి, ఇస్మాయిల్‌ఖాన్‌, హైదర్‌, నియాజ్‌హుసేన్‌, జాకీర్‌హుసేన్‌, అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 01 , 2026 | 11:07 PM