Share News

సూపర్‌ స్పెషాలిటీ పరీక్షలో సర్జరీ పీజీలకు ర్యాంకులు

ABN , Publish Date - Jan 27 , 2026 | 11:32 PM

దేశ వ్యాప్తంగా సూపర్‌ స్పెషాలిటీ, వైద్యకోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ సూపర్‌స్పెషాలిటీ ఫలితాల్లో కర్నూలు మెడికల్‌ కాలేజీకి చెందిన జనరల్‌ సర్జరీ పీజీ వైద్య విద్యార్థులు ర్యాంకుల పంట పండించారు.

సూపర్‌ స్పెషాలిటీ పరీక్షలో సర్జరీ పీజీలకు ర్యాంకులు
ఉత్తమ ర్యాంకులు సాధించిన సర్జరీ పీజీలు, వైద్యులను అభినందిస్తున్న ప్రిన్సిపాల్‌

12 మంది పీజీలకు ఉత్తమ ర్యాంకులు

కర్నూలు హాస్పిటల్‌, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): దేశ వ్యాప్తంగా సూపర్‌ స్పెషాలిటీ, వైద్యకోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ సూపర్‌స్పెషాలిటీ ఫలితాల్లో కర్నూలు మెడికల్‌ కాలేజీకి చెందిన జనరల్‌ సర్జరీ పీజీ వైద్య విద్యార్థులు ర్యాంకుల పంట పండించారు. ఏకంగా కర్నూలు మెడికల్‌ కాలేజీ నుంచి 12 మంది సర్జరీ పీజీ విద్యార్థులకు ఉత్తమ ర్యాంకులు సాధించి అందరి ప్రశంసలు పొందారు. కర్నూలు మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌, ఎంఎస్‌ చేసిన డి. విష్ణు శ్రీకర్‌ రెడ్డి, ఆలిండియాలో 65వ స్థానం సాధించి సత్తా చాటారు. ఇతను ఎంఎస్‌ సర్జరీ పరీక్షల్లో గత ఏడాది డా. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీలో స్టేట్‌ టాపర్‌గా నిలిచారు. డా. శ్రీకర్‌రెడ్డి, సర్జికల్‌ గ్యాస్ర్టోఎంట్రాలిజిలో సూపర్‌ స్పెషాలిటీ కోర్సు చేయాలనుకుంటున్నారని తెలిపారు. డా.కే. సాయి కళ్యాణ్‌ ఆలిండియాలో 75వ ర్యాంకు సాధించారు. ఆ తర్వాత సర్జరీ పీజీ విద్యార్థుల్లో డా. ఉదయ్‌ శంకర్‌కు 125వ ర్యాంకు, డా.కే. వినీతారెడ్డికి 210, డా. అంబటి తేజేశ్వరరెడ్డికి 324వ ర్యాంకు, డా.ఆర్‌. శిరీషకు 376, డా. జి. అనంత్‌ నివేష్‌కి 668, డా.పి. మహ్మద్‌ సర్పరాజ్‌కు 926, డా. పవన్‌ కళ్యాన్‌ 936, డా.వి. సాయిచరణ్‌కు 1022, డా.టి. మహేంద్రబాబుకు 1168, డా.ఈ. అనిల్‌ కుమార్‌కు 1500, డా.జి.సాయిహరీష్‌ రెడ్డికి 2206 ర్యాంకు వచ్చాయి. ఈ పీజీ విద్యార్థులను వైస్‌ ప్రిన్సిపాల్‌ డా.హరిచరణ్‌ అభినందించారు.

Updated Date - Jan 27 , 2026 | 11:32 PM