దొంగల బీభత్సం
ABN , Publish Date - Jul 02 , 2026 | 11:22 PM
పట్టణంలో దొంగలు బీభత్సం సృష్టించారు.
పోలీసులపై దాడి
ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపిన పోలీసులు
డోన్ టౌన్, జూలై 2 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో దొంగలు బీభత్సం సృష్టించారు. డోన్ రూరల్ సీఐ రాకేష్ తెలిపిన వివరాలు.. గురువా రం తెల్లవారుజామున 3.15గంటల సమయంలో పోలీసులకు పట్టణంలో పందుల దొంగతనానికి ప్రయత్నించి నిందితులు గూడ్స్ వాహనంలో గుత్తి వైపు వెళ్తున్నట్లు సమాచారం అందింది. రూరల్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన రోడ్ సేఫ్టీ (హైవే మొబైల్) సిబ్బంది నేల కనుమ మెట్ట సమీపంలోని జియో పెట్రోల్ బంక్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. అటు వైపు వచ్చిన అనుమానిత వాహనంలో వచ్చిన నిందితులు పోలీసు సిబ్బందిపై గాజుసీసాలు, రాళ్లతో దాడి చేశారు. పోలీసులు ఆత్మరక్షణ కోసం నిందితులను నిలువరించే ప్ర యత్నంలో ఒక రౌండ్ కాల్పులు జరిపారు. అయినా కూడా వారు వాహనాన్ని ఆపకుండా అతివేగంగా ప్యాపిలి వైపు పరారయ్యారు. హైవే మొబైల్ వాహనం దెబ్బతింది. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కాల్పుల్లో ఎవరికీ గాయాలు కాలేదన్నారు. ఈఘటనకు పాల్పడిన నిందితులు అత్యంత ప్రమాద కరమైన వారిగా గుర్తించామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించి అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు గురించి తెలిసిన వెంటనే సమాచారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నిందితులు ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు.