Share News

రంజాన్‌ పవిత్ర మాసం

ABN , Publish Date - Mar 04 , 2026 | 12:04 AM

రంజాన్‌ మాసం ఎంతో పవిత్రమైనదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ అన్నారు. నగరంలోని రోజా మసీదుతోపాటూ పోలీస్‌ లైన్‌ మసీదు, ధర్వేశ్‌ ఖాద్రి మసీదుల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ కార్యక్రమాల్లో మంత్రి టీజీ భరత్‌ పాల్గొన్నారు.

రంజాన్‌ పవిత్ర మాసం
ముస్లింలకు విందు ఇస్తున్న మంత్రి టీజీ భరత్‌

పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌

కర్నూలు అర్బన్‌/ కర్నూలు కల్చరల్‌ మార్చి 3 (ఆంధ్రజ్యోతి): రంజాన్‌ మాసం ఎంతో పవిత్రమైనదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ అన్నారు. నగరంలోని రోజా మసీదుతోపాటూ పోలీస్‌ లైన్‌ మసీదు, ధర్వేశ్‌ ఖాద్రి మసీదుల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ కార్యక్రమాల్లో మంత్రి టీజీ భరత్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజా మసీదులో ఉపవాసాలు విరమించిన ముస్లింలకు ఆయనే స్వయంగా వడ్డించారు. పోలీస్‌ లైన్‌ మసీదుతోపాటూ, ధర్వేశ్‌ ఖాద్రీ మసీదుల్లో నూతనంగా నిర్మించిన మినార్‌లను ప్రారంభించారు. మంత్రి టీజీ భరత్‌ మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో మసీదులను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. నగరంలోని మసీదుల్లో ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హజ్‌ కమిటీ సభ్యుడు మన్సూర్‌ అలీఖాన్‌, మసీదు కమిటీ అధ్యక్షుడు షేక్‌ యూనిస్‌, మహబూబ్‌ ఖాన్‌, ఆయా మసీదుల కమిటీ సభ్యులు, ముస్లింలు పాల్గొన్నారు.

Updated Date - Mar 04 , 2026 | 12:04 AM