రమేశ్ హత్య దారుణం
ABN , Publish Date - Feb 08 , 2026 | 12:15 AM
దళిత సంఘం నాయకుడు రమేశ్‌ను హత్య చేయడం దారుణమని ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ అన్నారు. మండలంలోని బొందిమడుగులలో హత్యకు గురైన ఎమ్మార్పీఎ్‌సఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేశ్ కుటుంబాన్ని శనివారం ఆయన పరామర్శించారు.
బాధిత కుటుంబానికి అండగా ఉంటాం
ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్
తుగ్గలి, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): దళిత సంఘం నాయకుడు రమేశ్‌ను హత్య చేయడం దారుణమని ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ అన్నారు. మండలంలోని బొందిమడుగులలో హత్యకు గురైన ఎమ్మార్పీఎ్‌సఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేశ్ కుటుంబాన్ని శనివారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా జవహర్ మాట్లాడుతూ దళితులపై దాడులను సహించమన్నారు. బాధిత కుటుంబానికి అం డగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ ఘాతుకాలకు పాల్పడిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్బంగా రమేష్ మృతికి నివాళులర్పించారు. దళిత సంఘం నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.