దాతృత్వానికి ప్రతీక రంజాన్
ABN , Publish Date - Mar 16 , 2026 | 12:21 AM
దాన, ధర్మాలు, దాతృత్వానికి ప్రతీక రంజాన్ అని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.
ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
ముస్లింలకు ఇఫ్తార్
బనగానపల్లె, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): దాన, ధర్మాలు, దాతృత్వానికి ప్రతీక రంజాన్ అని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి పట్టణంలోని ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. మొత్తం 30 మసీదుల్లో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇష్తార్ విందు ఏర్పాటు చేయించారు. జుమ్మామసీదులో ముస్లింల ప్రార్థనల అనంతరం మంత్రి విందులో పాల్గొని అల్పాహారం స్వీకరించారు. ముస్లింలకు స్వయంగా వడ్డించారు. మంత్రి బీసీ మాట్లాడుతూ పట్టణంలో అందరూ మత సామరస్యంతో కలిసి మెలిసి ఉండాలన్నదే ఇఫ్తార్ విందుముఖ్య ఉద్దేశ్యమన్నారు. మైనార్టీ సోదరులకు తాను ఎల్లవేళలా అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారు. ముస్లిం మతగురువులు, టీడీపీ నాయకులు బురానుద్దీన్, అబ్దుల్‌కలాం, సలాం, ఖాన్, నియాజ్ కార్యకర్తలు భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.