రాజా వాసిరెడ్డి సేవలు చిరస్మరణీయం: కలెక్టర్
ABN , Publish Date - Apr 28 , 2026 | 12:05 AM
రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ప్రజల కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ డాక్టర్ సిరి కొనియాడారు.
కర్నూలు కలెక్టరేట్, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ప్రజల కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ డాక్టర్ సిరి కొనియాడారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో రాజా వాసిరెడ్డి జయంతి సందర్భంగా ఆయన చిత్రప టానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాజా వాసిరెడ్డి ఆంధ్రప్రదేశ చరిత్రలో ప్రముఖ జమీందారులలో ఒకరన్నారు. గుంటూరు జిల్లాలోని అమరావతి ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని ఆయన పరిపాలన సాగించారన్నారు. ప్రజా సంక్షేమం, ధార్మికసేవలు, వ్యవసాయాభివృద్ధి వంటి అనేక రంగాల్లో ఆయన చేసిన సేవలు అపారమని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి చిరంజీవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనూరాధ, పర్యాటక శాఖ అధికారి శ్రీనివాసులు పాల్గొన్నారు.