రైతుబజారు రహదారి కబ్జా
ABN , Publish Date - Jan 20 , 2026 | 12:40 AM
సి.క్యాంపు రైతుబజారులో కబ్జాల పర్వం తానస్థాయికి చేరింది. ఇప్పటికే దళారులు, తిష్టవేస్తుంటే.. వారిని ఏరివేసేం దుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలకు నాయకులు గండి కొడుతున్నారు.
కలెక్టర్‌కు రైతుల ఫిర్యాదు.. అధికారులపై కలెక్టర్ ఆగ్రహం
కర్నూలు అగ్రికల్చర్, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): సి.క్యాంపు రైతుబజారులో కబ్జాల పర్వం తానస్థాయికి చేరింది. ఇప్పటికే దళారులు, తిష్టవేస్తుంటే.. వారిని ఏరివేసేం దుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలకు నాయకులు గండి కొడుతున్నారు. కాగా రైతులు పంట ఉత్పత్తులను రైతు బజారుకు తీసుకువచ్చేందుకు అణు వుగా ఉన్న రోడ్డును కొంత మంది కబ్జా చేశారు. దీంతో రైతులు కలెక్టర్ డాక్టర్ సిరికి గ్రీవెన్స్‌లో వినతి పత్రం సమర్పించి మొర పెట్టుకున్నారు. స్పందించిన కలెక్టర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ విశ్వనాథ్, మార్కెటింగ్ ఏడీఎం నారాయణ మూర్తిని పిలిపించి రైతుబజారు వెళ్లే రోడ్డు కబ్జాకు గురైతే మీరేం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం సమాధానం చెప్పాలో తెలియక అధికారులు నీళ్లు నమిలారు. వెంటనే రోడ్డుకు అడ్డంగా ఉన్న బంకుతో పాటు ఇతర ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు.