సానుకూలంగా ప్రజాభిప్రాయం పెంచండి
ABN , Publish Date - Apr 02 , 2026 | 11:20 PM
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రజాభిప్రాయాన్ని సానుకూలంగా పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ రాజకుమారి
నంద్యాల నూనెపల్లి, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రజాభిప్రాయాన్ని సానుకూలంగా పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ప్రజా సానుకూలత, ప్రాజెక్టు జలధార అమలుపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆరోగ్య శాఖలో సెకండరీ హెల్త్ సేవలపరంగా సున్నిపెంట, పరిసర మండలాల్లో వైద్యుల కొరత కారణంగా ప్రజలకు సరైన సేవలందించడంలో లోపాలున్నాయని సమస్యను పరిష్కరించాలన్నారు. బేతంచర్ల మండలంలో సరిపడా మరుగుదొడ్లు లేకపోవడం వల్ల ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తోందని తగిన చర్యలు తీసుకోవాలన్నారు. గ్యాస్ సరఫరాలో అక్రమ వసూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రిజిస్ర్టేషన్ శాఖలో కార్యాలయాల్లో తెలుగులో బోర్డులు ఏర్పాటు చేయాలని, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించచారు. అలాగే అవుకు, నందికొట్కూరు మండలాల్లో ప్రజా సంతృప్తి తక్కువగా ఉన్నందున ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.