స్పర్శ దర్శనాలపై అవగాహన కల్పించండి
ABN , Publish Date - Mar 10 , 2026 | 11:14 PM
ఉగాది మహోత్సవాల సందర్భంగా రోజుకు నాలుగు విడతలుగా స్పర్శ దర్శన టికెట్లను క్యూలైన్ వద్ద అందుబాటులో ఉంచుతున్నట్లు భక్తులకు అవగా హన కల్పించాలని ఈవో శ్రీనివాసరావు అన్నారు.
క్యూలైన్ల వద్ద కన్నడ వలంటీర్లను ఏర్పాటు చేయాలి
ఈవో శ్రీనివాసరావు
శ్రీశైలం, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): ఉగాది మహోత్సవాల సందర్భంగా రోజుకు నాలుగు విడతలుగా స్పర్శ దర్శన టికెట్లను క్యూలైన్ వద్ద అందుబాటులో ఉంచుతున్నట్లు భక్తులకు అవగా హన కల్పించాలని ఈవో శ్రీనివాసరావు అన్నారు. ఆయన మం గళవారం మాట్లాడుతూ ప్రతి స్లాట్‌లో కేవలం రూ.2000 టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంచుతూ రూ.1500 టెక్కెట్లను క్యూలైన్ వద్ద నేరుగా భక్తులకు ఇవ్వాలని, రూ.500 టిక్కెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని కన్నడ భక్తులకు మైక్ అనౌన్స్‌మెంట్ ద్వారా అవగాహన కల్పించాలని అధికారులకు సూచనలు చేశారు. కంపార్టుమెంట్లలో వేచి ఉండే భక్తులకు సకా లంలో మంచినీరు, అల్పాహారాలు అందించడంలో శివసేవకులతో సహాయ సహకారాలు తీసుకోవాలన్నారు.
మరో ఐదు రోజులు మాత్రమే స్పర్శ దర్శనం
మల్లన్న స్పర్శ దర్శన భాగ్యం మరో ఐదు రోజులు మాత్రమే ఉండటంతో కన్నడ భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైలం చేరుకుంటున్నారు. ఉగాది మహోత్సవాలలో 16వ తేది నుంచి 20వ తేది వరకు అందరికీ అలంకార దర్శనం మాత్రమే అందుబాటులో ఉంటుంది.