Share News

చట్టాలపై అవగాహన కల్పించండి

ABN , Publish Date - Jan 20 , 2026 | 11:30 PM

సైబర్‌ నేరాలు, మహిళా, నూతన చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ విక్రాంత్‌ పా టిల్‌ అన్నారు.

చట్టాలపై అవగాహన కల్పించండి
రికార్డులను పరిశీలిస్తున్న ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌

ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌

పెద్దకడబూరు, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): సైబర్‌ నేరాలు, మహిళా, నూతన చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ విక్రాంత్‌ పా టిల్‌ అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని పో లీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీచేసి రికార్డులు పరిశీలించారు. ఈ సం దర్భంగా పోలీస్‌స్టేషన్‌లో ఆయన నమోదైన కేసుల్లో పెండింగ్‌ కేసుల, వాటి స్థితిగతులపై ఆరా తీశారు. నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తు పురో గతులపై ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలపై ఆరాతీశారు. ఎక్కువగా విజిబుల్‌ పోలీసింగ్‌ చేసి నేర నియంత్ర ణకు చర్యలు చేపట్టాలన్నారు. బాధితులు పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్ర యించి నప్పుడు వారి సమస్యలకు పరిష్కారం చూపాల న్నారు. కార్య క్రమంలో ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి, కోసిగి సీఐ మంజు నాథ్‌, పెద్ద కడబూరు ఎస్‌ఐ నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jan 20 , 2026 | 11:30 PM