కొనసాగుతున్న వర్షాలు..
ABN , Publish Date - Sep 23 , 2026 | 11:48 PM
మండల కేంద్రంలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు కొనసాగుతున్నాయి. బుధవారం సాయంత్రం వర్షం కురిసింది. పెట్నీకోట, బెలుం, బెలుంశింగవరం, మీర్జాపురం, కొలిమిగుండ్ల, కల్వటాల గ్రామాల్లో వాగులు, వంకలు నిండిపోయాయి. ఇంరా వర్షాలు కురుస్తుండటంతో కుంటలు, చెరువుల్లోకి నీరు చేరే అవకాశం ఉందని రైతులు, గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కొలిమిగుండ్ల, దొర్నిపాడు, కోవెలకుంట్ల, చాగలమర్రిలో నిండిన చెరువులు, పొంగిన కుంటలు
కొలిమిగుండ్ల, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు కొనసాగుతున్నాయి. బుధవారం సాయంత్రం వర్షం కురిసింది. పెట్నీకోట, బెలుం, బెలుంశింగవరం, మీర్జాపురం, కొలిమిగుండ్ల, కల్వటాల గ్రామాల్లో వాగులు, వంకలు నిండిపోయాయి. ఇంరా వర్షాలు కురుస్తుండటంతో కుంటలు, చెరువుల్లోకి నీరు చేరే అవకాశం ఉందని రైతులు, గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జీఎన్‌ఎస్‌ఎస్ కాలువలో 5,500ల ప్రవాహం
అవుకు రిజర్వాయర్ నుంచి కొలిమిగుండ్ల మీదుగా ప్రవహించే జీఎన్‌ఎస్‌ఎస్ కాలువ జలకళ సంతరించుకుంది. కడప చిత్తూరు జిల్లాల తాగునీటి అవసరాలకు 5,500 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. దీంతో కాలువనిండా నీటి ప్రవాహం ఆకట్టుకుం టోంది. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలతో గోరుకల్లు నుంచి కృష్ణాజలాలు మూడు టీఎంసీలు అవుకు రిజర్వాయర్‌కు చేరాయి.
దొర్నిపాడు: మూడు రోజులుగా మండలంలో వర్షాలు కురుస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పత్తి, మిరప తదితర పంటలు ఈ వర్షంతో పచ్చగా కళకళలాడుతున్నాయి.
గాలి, వాన భీభత్సం
కోవెలకుంట్ల: మండలంలో మంగళవారం రాత్రి, బుధవారం కూడా వర్షం కురిసింది. గాలి వాన భీభత్సానికి భీమునిపాడు - కంపమల్ల మెట్ట వద్ద రామచంద్రా రెడ్డికి చెందిన గోదాం కప్పు రేకులు ఎగిరిపోయి శనగ, వరి బస్తాలు తడిసిపోయాయి. సుమారు 3వేల మంది రైతులు శనగలు, వడ్ల బస్తాలను నిల్వ ఉంచారు. శనగలు, వడ్లు ఈ వర్షానికి తడిసిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. రోడ్డు పక్కనే ఉన్న భారీ చెట్టు విరిగి రోడ్డుకు అడ్డంగా పడడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
చాగలమర్రి: మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం కూడా ఓ మోస్తరు వర్షం కురిసింది. వాతావరణం చల్లబడటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.