Share News

కొనసాగుతున్న వర్షాలు

ABN , Publish Date - Sep 21 , 2026 | 11:54 PM

మండలంలో రెండు రోజులుగా వర్షం కురుస్తోంది. సోమవారం ఉదయం భారీ వర్షం కురిసింది. రహదారులపై నీరు ప్రవహించి ఎక్కడ చూసినా వర్షపు నీరు పొలాల్లో నిలిచింది. ఇంతటి వర్షం గతంలో ఎన్నడు కురవలేదని స్థానిక ప్రజలు తెలిపారు. కాగా కొందరు రైతులు రహదారిపై ఆరబోసి మొక్కజొన్నలు తడిచి ముద్దయ్యాయి.

కొనసాగుతున్న వర్షాలు
రుద్రవరంలో కురుస్తున్న వర్షం

రుద్రవరం, కొలిమిగుండ్ల మండలాల్లో భారీగా.. చాగలమర్రిలో ఓ మోస్తరు..

రుద్రవరం, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): మండలంలో రెండు రోజులుగా వర్షం కురుస్తోంది. సోమవారం ఉదయం భారీ వర్షం కురిసింది. రహదారులపై నీరు ప్రవహించి ఎక్కడ చూసినా వర్షపు నీరు పొలాల్లో నిలిచింది. ఇంతటి వర్షం గతంలో ఎన్నడు కురవలేదని స్థానిక ప్రజలు తెలిపారు. కాగా కొందరు రైతులు రహదారిపై ఆరబోసి మొక్కజొన్నలు తడిచి ముద్దయ్యాయి.

తిమ్మనాయునిపేటలో భారీ వర్షం

కొలిమిగుండ్ల: మండలంలోని తిమ్మనాయునిపేట గ్రామంలో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. వీధులు జలమయంగా మారాయి. గ్రామ శివార్లలోని పలువురి ఇండ్లలోకి నీరు ప్రవేశించినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.

మండలంలోని చింతలాయపల్లె ప్రధాన రహదారిపై వర్షపునీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. తాడిపత్రి నంద్యాల, కొలిమిగుండ్ల, అబ్దులాపురం గ్రామాలకు ఈ రహదారిపైనే వాహనాలు వెళుతుంటాయి. అధికారులు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Updated Date - Sep 21 , 2026 | 11:54 PM