పోటెత్తిన తుంగభద్ర
ABN , Publish Date - Sep 25 , 2026 | 12:18 AM
ఎగువ ప్రాంతమైన కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర నదిలో వరద ప్రవాహం పోటెత్తింది.
ఆర్డీఎస్ ఆనకట్టను పరిశీలించిన అధికారులు
కోసిగి, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఎగువ ప్రాంతమైన కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర నదిలో వరద ప్రవాహం పోటెత్తింది. కోసిగి మండల పరిధిలోని అగసనూరు సమీపంలో తుంగభద్ర నదిపై ఉన్న ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద గురువారం భారీగా నీరు ప్రవహించింది. దీంతో నదీ తీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోసిగి పోలీసులు సూచించారు. కోసిగి సీఐ బి.ఎ. మంజునాథ్, ఎస్‌ఐ డి. రమే్‌షరెడ్డి ఆర్డీఎస్ ఆనకట్ట పరిసరాలను పరిశీలించారు. అగసనూరు, సాతనూరు, తుమ్మిగనూరు తదితర నదీ తీర ప్రాంతాల ప్రజలకు జాగ్రత్తలు సూచించారు. నదిలో నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో ఈతకు, చేపల వేటకు, నది పరిసరాలను చూసేందుకు ఎవరూ వెళ్లొద్దని హెచ్చరించారు.