పంటలకు జీవం పోసిన వర్షం
ABN , Publish Date - Aug 05 , 2026 | 12:15 AM
మండలంలో సోమవారం రాత్రి ఓ మోస్తరు వర్షం కురిసింది. 18.2 మీ.మీ వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ అధికారి అబ్దుల్‌సత్తార్ తెలిపారు.
చాగలమర్రిలో 18.2 మి.మీ.లు, రుద్రవరంలో 22.2 మి.మీ.లు ఫ కళకళలాడుతున్న పంటలు
చాగలమర్రి, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): మండలంలో సోమవారం రాత్రి ఓ మోస్తరు వర్షం కురిసింది. 18.2 మీ.మీ వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ అధికారి అబ్దుల్‌సత్తార్ తెలిపారు. ఈ వర్షం మొక్కజొన్న, వేరుశనగ, మినుము, పెసర, పసుపు పంటలకు జీవం పోసింది. ఎల్‌నినో ప్రభావంతో నెల నుంచి బెట్టకు గురైన తరుణంలో వర్షం కురవడంతో మొక్కలు పచ్చగా కనిపిస్తున్నాయని, పొలాల్లో విత్తనాలు వేసేందుకు భూమి పదును అయిందని రైతులు హర్షం వ్యక్తం చేశారు.
రుద్రవరం: మండలంలో సోమవారం రాత్రి 22.2 మి.మీ. వర్షం కురిసింది. వాగులు వంకలు పొంగి ప్రవహించాయి. శ్రీరంగాపురం, డి.కొట్టాలు, చిన్నకంబలూరు గ్రామాల సమీపంలోని కోడిపిల్లవాగు, కొండవాగు పొంగి వాడుబట్టిన పంటలకు వర్షం ప్రాణం పోసిందని రైతులు హర్షం వ్యక్తం చేశారు.