వాన కురిసింది.. మనసు మురిసింది
ABN , Publish Date - Sep 20 , 2026 | 12:11 AM
పట్టణంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది, దీంతో ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజుల నుంచి పంటలు ఎండిపోయి ఆందోళనలో ఉన్న రైతులకు, ప్రజలకు ఈ వర్షం ఊపిరినిచ్చింది.
కోవెలకుంట్ల, సంజామల, ఆళ్లగడ్డ, బేతంచెర్ల మండలాల్లో భారీగా, కొలిమిగుండ్లలో ఓ మోస్తరు వర్షం
కోవెలకుంట్ల, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): పట్టణంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది, దీంతో ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజుల నుంచి పంటలు ఎండిపోయి ఆందోళనలో ఉన్న రైతులకు, ప్రజలకు ఈ వర్షం ఊపిరినిచ్చింది.
బేతంచెర్ల: శనివారం సాయంత్రం 6.30 గంటల నుంచి 7.30 గంటల వరకు భారీ వర్షం దంచి కొట్టింది. దీంతో ప్రజలు కొంత ఉపశమనం పొందారు. ఎండిపోతున్న పంటలకు ఈ వర్షం ఊపిరి పోసిందని రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎండవేడిమి తగ్గే అవకాశం ఉందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కొలిమిగుండ్ల: మండలంలో రాత్రి 8 గంటల నుంచి అరగంటపాటు ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో పంటలకు ఊపిరి పోసినట్లయింది.
సంజామల: సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భారీ వర్షం కుమ్మేసింది. ఈ ఖరీ్‌ఫ్‌లో ఇదే మొదటి భారీ వర్షమని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మిరప, మినుము, కంది పంటలకు వర్షం ఊపిరి పోసినట్లు అయిందని రైతులు అంటున్నారు.