వర్షం.. హర్షం
ABN , Publish Date - Jul 19 , 2026 | 12:14 AM
మండలంలో శుక్ర, శనివారాల్లో భారీ వర్షం కురియడంతతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రుద్రవరం 4.9 సెం.మీల వర్షం కురియడంతో వర్షపునీరు పొలాలకు చేర్వొఒ. ఎండ, గాలికి వాడుబడుతున్న మొక్కజొన్న, మినుము, వేరుశనగత పాటు ఇతర పంటలకు వర్షం ప్రాణం పోసింది. దీంతో పంటలు కళకళలాడుతున్నాయని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేశారు.
రుద్రవరంలో భారీగా, సంజామల, శిరువెళ్లలో మోస్తరు వాన
పంటలకు జీవం పొసిందంటున్న రైతులు
రుద్రవరం, జూలై 18 (ఆంధ్రజ్యోతి): మండలంలో శుక్ర, శనివారాల్లో భారీ వర్షం కురియడంతతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రుద్రవరం 4.9 సెం.మీల వర్షం కురియడంతో వర్షపునీరు పొలాలకు చేర్వొఒ. ఎండ, గాలికి వాడుబడుతున్న మొక్కజొన్న, మినుము, వేరుశనగత పాటు ఇతర పంటలకు వర్షం ప్రాణం పోసింది. దీంతో పంటలు కళకళలాడుతున్నాయని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేశారు.
ఊపిరి పోసిన వర్షం
సంజామల: శుక్రవారం రాత్రి, శనివారం ఓ మోస్తరు వర్షం కురియడంతో పంటలకు మేలు చేకూరింది. జూన్ అడపాదడపా కురిసిన వర్షాలతో రైతులు మొక్కజొన్న, మిరప, మినుము, పెసర సాగు చేశారు. అనంతరం వర్షం లేక పంటలు ఎండుముఖం పట్టాయి. ఎట్టకేలకు శుక్రవారం రాత్రి కురిసిన 17.0 మి.మీ వర్షం కురియడంతో రైతులు ఊరట చెందుతున్నారు.
మినుము పంటకు ఊపిరిపోసిన వర్షం
శిరివెళ్ల: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మినుము పంటకు మేలు కలిగింది. మండలంలో అధికంగా మినుము సాగుచేశారు. కొన్ని రోజులుగా వర్షాలు లేక పంటలు ఎండిపోతున్న తరుణంలో ఈ వర్షంతో కొంత మేలు.