వర్షం.. రైతుకు భయం
ABN , Publish Date - Mar 19 , 2026 | 12:16 AM
జిల్లాలో గాలివాన, పిడుగులతో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో బుధవారం మోస్తరు వర్షం కురిపింది.
ఇప్పటికే ఎండుమిర్చి, మొక్కజొన్న కోతలు
వర్షం నష్టం చేస్తుందేమోనని ఆందోళన
కొలిమిగుండ్ల, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గాలివాన, పిడుగులతో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో బుధవారం మోస్తరు వర్షం కురిపింది. మొక్కజొన్న, మిరప కోతలు కోసిన రైతులకు కంటి మీద కునుకు లేకుండాపోయింది. రైతులు ఎండు మిర్చి కోసి, పొలాల్లోనే ఆరబెట్టారు. మరోవైపు మొక్కజొన్న కూడా కొందరు రైతులు కోతకోయగా, మరికొన్ని చోట్ల కోతకు సిద్ధంగా ఉంది. దీంతో పంట ఉత్పత్తులను కాపాడుకోవడానికి రైతులు టార్పాలిన్లు కప్పుతూ అష్టకష్టాలు పడుతున్నారు. గురువారం కూడా వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు ప్రకటించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.