రైల్వే సౌకర్యాలు కల్పించాలి
ABN , Publish Date - Apr 08 , 2026 | 12:11 AM
కర్నూలు నగర ప్రజలకు రైల్వే సౌకర్యాలు కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి. గౌస్‌దేశాయ్ డిమాండ్ చేశారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్‌దేశాయ్
కర్నూలు న్యూసిటీ, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): కర్నూలు నగర ప్రజలకు రైల్వే సౌకర్యాలు కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి. గౌస్‌దేశాయ్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై మంగళవారం రెండో దశ పోరాటాన్ని సీపీఎం ప్రారంభించింది. ఇందులో భాగంగా స్థానిక హెడ్ పోస్టాఫీసు దగ్గర పోస్టుకార్డుల రాస్తూ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవి, రైల్వే బోర్డు చైర్మన్ సతీష్‌కుమార్, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌కు ప్రజల చేత పోస్టు కార్డు పంపించే కార్యక్రమాన్ని చేప ట్టారు. ఈ సందర్భంగా గౌస్‌దేశాయ్ మాట్లాడుతూ కర్నూలు నుంచి విజయవాడకు ఇంటర్ సిటీ రైలు నడపాలని, రద్దు చేసిన మచిలీ పట్నం రైలును తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్య క్రమంలో పార్టీ పాతబస్తీ కార్యదర్శి ఎం. రాజశేఖర్, ఎం. విజయ్, షరీఫ్, అబ్దుల్లా, రామక్రిష్ణ, ఖాజాబాషా తదితరులు పాల్గొన్నారు.