Share News

ఆర్‌.కృష్ణాపురంలో అహోబిలేశుడు

ABN , Publish Date - Jan 19 , 2026 | 12:23 AM

మండలంలోని ఆర్‌.కృష్ణాపు రం గ్రామంలో ఆదివారం అహోబిల లక్ష్మీనరసింహస్వామి పార్వేట ఉత్సవ పల్లకి కొలువు దీరింది.

ఆర్‌.కృష్ణాపురంలో అహోబిలేశుడు
అహోబిలేశుడికి గ్రామోత్సవం నిర్వహిస్తున్న అర్చకులు

ఆళ్లగడ్డ జనవరి 18(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఆర్‌.కృష్ణాపు రం గ్రామంలో ఆదివారం అహోబిల లక్ష్మీనరసింహస్వామి పార్వేట ఉత్సవ పల్లకి కొలువు దీరింది. బాచేపల్లె నుంచి శనివారం రాత్రి బయలు దేరి ఆర్‌ కృష్ణాపురం గ్రామానికి చేరుకోగానే గ్రామ పెద్దలు ఊరేగింపుగా వెళ్లి స్వామివారి పల్లకిని భుజాలపై మోస్తూ గ్రామంలోకి ఆహ్వానించారు. అనంతరం గ్రామంలోని తెలుపులపై కొలువు దీర్చారు. ఈ సందర్భంగా ఉత్సవ పల్లకిలో కొలువైన జ్వాలా నరసింహస్వామి, ప్రహ్లాద వరద స్వాములకు ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బంధువులతో ఇండ్లల్లో సందడి వాతావారణం నెలకొంది. స్వామి పల్లకి వద్దకు చేరుకొని చిరుకానుకలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి స్వామి వారి పల్లకి కోటకందుకూరు గ్రామానికి చేరుకుంటుంది.

Updated Date - Jan 19 , 2026 | 12:23 AM