Share News

వైభవంగా రాఘవేంద్రుల స్వర్ణ పల్లకోత్సవం

ABN , Publish Date - Apr 05 , 2026 | 11:29 PM

వేద పండితుల మంత్రో చ్ఛారణాలు, మంగళవాయిద్యాల మధ్య రాఘవేంద్ర స్వామి స్వర్ణ పల్లకోత్స వం నిర్వహించారు.

వైభవంగా రాఘవేంద్రుల స్వర్ణ పల్లకోత్సవం

మంత్రాలయం, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): వేద పండితుల మంత్రో చ్ఛారణాలు, మంగళవాయిద్యాల మధ్య రాఘవేంద్ర స్వామి స్వర్ణ పల్లకోత్స వం నిర్వహించారు. ఆదివారం చైత్రమాస తదియ శుభదినాన్ని పురస్కరిం చుకొని మఠం పీఠాఽధిపతి సుబుధేం ద్రతీర్థుల ఆఽధ్వర్యంలో మఠం అర్చకులు బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాఘవేంద్రస్వామి బృందావన ప్రతిమను స్వర్ణపల్లకిలో అధిష్టించి శ్రీమఠం ప్రాంగణం చుట్టు అంగరంగ వైభవంగా ఊరేగించారు. ఊంజలసేవ నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. పీఠాధిపతి భక్తులకు ఫల, పుష్ప, మంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు.

Updated Date - Apr 05 , 2026 | 11:29 PM