Share News

విద్యాసంస్ధల్లో ర్యాగింగ్‌ నిర్మూలించాలి : ఏఎస్పీ

ABN , Publish Date - Nov 13 , 2026 | 11:15 PM

విద్యార్థులందరూ పరస్పర స్నేహభావంతో మెలగాలని నంద్యాల ఏఎస్పీ సుస్మిత అన్నారు. శుక్రవారం నంద్యాల ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో యాంటీ ర్యాగింగ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

విద్యాసంస్ధల్లో ర్యాగింగ్‌ నిర్మూలించాలి : ఏఎస్పీ
మెడికల్‌ విద్యార్దులతో ముఖ్య అతిధులు

నంద్యాల హాస్పిటల్‌, నవంబరు 13, (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులందరూ పరస్పర స్నేహభావంతో మెలగాలని నంద్యాల ఏఎస్పీ సుస్మిత అన్నారు. శుక్రవారం నంద్యాల ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో యాంటీ ర్యాగింగ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఎస్పీ మాట్లాడుతూ విద్యాసంస్ధల్లో ర్యాగింగ్‌ను పూర్తిగా నిర్మూలించాలన్నారు. విద్యార్ధులు క్రమశిక్షణ పాటిస్తూ కళాశాలలో ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన విద్య వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సురేఖ, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రాజశేఖర్‌, జిజిహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జిలానీ, వివిధ విభాగాల వైద్యులు, విద్యార్ధులు పాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2026 | 11:15 PM