పారిశుధ్య నిర్వహణలో సమూల మార్పులు
ABN , Publish Date - Aug 28 , 2026 | 12:08 AM
నగరంలో పరిశుభ్రతను మరింత మెరుగుపరచడంతో పాటు పారిశుధ్య నిర్వహ ణలో సమూల మార్పులు తీసుకురావడానికి నగరపాలక సంస్థ చర్యలు చేపడుతుందని కమిషనర్ చల్లా ఓబులేసు అన్నారు.
నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు
కర్నూలు న్యూసిటీ, ఆగస్టు 27(ఆంధ్రజ్యోతి): నగరంలో పరిశుభ్రతను మరింత మెరుగుపరచడంతో పాటు పారిశుధ్య నిర్వహ ణలో సమూల మార్పులు తీసుకురావడానికి నగరపాలక సంస్థ చర్యలు చేపడుతుందని కమిషనర్ చల్లా ఓబులేసు అన్నారు. గురువా రం ఆయన కిడ్స్ వరల్డ్ కూడలి, బుధవారపేట, వినాయక ఘాట్, ఓమెగా ఆసుపత్రి ప్రాంతాల్లో పారిశుధ్య పనులను తనిఖీ చేశారు. విజ యపురి కాలనీ, శివప్రియనగర్ ప్రాంతాల్లో పీజీఆర్‌ఎస్ ఫిర్యాదులను పరిశీలించారు. పరిమళ నగర్‌లో అన్న క్యాంటీనను తనిఖీ చేసి శుభ్ర తపై ఆరాతీశారు. వెంకటరమణ కాలనీలోని విశాల్ మార్ట్ వెనుకభా గాన ఈ-ఆటోల పార్కింగ్, చార్జింగ్, గార్బేజ్ ట్రాన్సఫర్ స్టేషన్లను పరిశీలించారు. కేసీ కెనాల్‌లో యుద్దప్రాతిపదికన కొనసాగుతున్న గుర్రపుడెక్క మొక్కల తొలగింపు పనులను పరిశీలించి మాట్లలడారు. స్వచ్ఛాంద్ర కార్పొరేషన ద్వారా త్వరలో 91 చెత్త సేకరణ ఈ-ఆటోలు అందుబాటులోకి రానున్నాయని, ఇప్పటికే తొలిదశలో 42 ఈ-ఆటోలు నగరానికి చేరుకున్నాయన్నారు. ఎస్‌ఈ జే.రమణమూర్తి, డీఈఈలు పవనకుమార్‌రెడ్డి, నరేష్, ఏఈలు వైష్ణవి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తదిత రులు పాల్గొన్నారు.