సమస్యలకు సత్వర పరిష్కారం
ABN , Publish Date - Jun 23 , 2026 | 12:32 AM
పజల నుంచి వస్తున్న అర్జీలను సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు.
నంద్యాల నూనెపల్లి, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): పజల నుంచి వస్తున్న అర్జీలను సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్‌ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆమె ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటికే రీ ఓపెన్ అయిన 96 దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అలాగే ముఖ్యమంత్రి స్థాయిలో నిర్వహిస్తున్న ప్రజా పరిష్కార వేదికకు సంబంధించిన నాలుగు అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని త్వరితగతిన పరిష్కరించాలన్నారు. పీజీఆర్‌ఎ్‌సలో మొత్తం 349 అరర్జీలు, రెవెన్యూ క్లినిక్ ద్వారా 177 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ సూరజ్ ధనుంజయ్, డీఆర్వో రామునాయక్, పీజీఆర్‌ఎస్ నోడల్ అధికారి ఉమామహేశ్వరి పాల్గొన్నారు.
పల్స్ పోలియోను జయప్రదం చేయండి
ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులకు పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్‌లో పల్స్ పోలియో, డయేరియా నివారణ చర్యలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. జూన్ 28న నిర్వహించనున్న పల్స్ పోలియోను జిల్లాలో వందశాతం విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. నంద్యాల జిల్లాలో 1,320 పోలియో బూత్‌లు, 44 ట్రాన్సిల్ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొబైల్ కేంద్రాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వంటి రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం వాల్‌పోస్టర్లను విడుదల చేశారు.