యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు
ABN , Publish Date - Oct 17 , 2026 | 11:39 PM
కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణలో భాగంగా కౌంటింగ్ కేంద్రం వద్ద అవసరమైన ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నామని అడిసనల్ ఎలక్షన్ అథారిటీ, కార్పొరేషన్ కమిషనర్ చల్లా ఓబులేసు అన్నారు.
అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, కమిషనర్ చల్లా ఓబులేసు
కర్నూలు న్యూసిటీ, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణలో భాగంగా కౌంటింగ్ కేంద్రం వద్ద అవసరమైన ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నామని అడిసనల్ ఎలక్షన్ అథారిటీ, కార్పొరేషన్ కమిషనర్ చల్లా ఓబులేసు అన్నారు. శనివారం నగర శివారులోని అథేనా పాఠశాలలో చేపడుతున్న ఏర్పాట్ల పనులను పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో లోటుపాట్లకు తావు లేకుండా సిబ్బంది, అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లకు అవసరమైన సౌకర్యాలు కల్పిం చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కౌంటింగ్ కేంద్రానికి వచ్చే వాహనాల పార్కింగ్ కోసం సమీపంలో ప్రత్యేక స్థలాలను గుర్తించి, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఎన్నికల సామాగ్రి పంపిణీ, బ్యాలెట్ బాక్సుల భద్రత, బస్సుల రాకపోకలు, పార్కింగ్ ప్రాంతాలు, సిబ్బంది దిగే ప్రదేశాలు, సూచిక బోర్డులు, లైటింగ్ ఏర్పాట్లను పకడ్బంధీగా పూర్తి చేయాలని సూచించారు. ఎస్ఈ జే.రమణమూర్తి, ఎంఈలు మనోహర్‌రెడ్డి, గిరిరాజు, డీఈఈలు నరే్‌ష,పవన్‌కుమార్‌రెడ్డి, శ్రీనివాసన్, ఏఈలు జనార్దన్, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, శానిటరీ సూపర్వైజర్ రమే్‌షబాబు పాల్గొన్నారు