Share News

సన్నబియ్యం కోసం క్యూ

ABN , Publish Date - Oct 28 , 2026 | 11:30 PM

సన్నబియ్యం కోసం క్యూ

సన్నబియ్యం కోసం క్యూ
అమీన్‌ అబ్బాస్‌నగర్‌ రైతుబజార్‌లో సన్నబియ్యం కోసం బారులు తీరిన ప్రజలు

కర్నూలు అగ్రికల్చర్‌, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ధరణి పేరుతో సన్నబియ్యాన్ని కిలో రూ.50కే అందిస్తోంది. బహిరంగ మార్కెట్‌లో రూ.80కు పైగా కిలో బియ్యం చొప్పు న వ్యాపారులు వసూలు చేస్తున్నారు. బుధవారం అమీన్‌ అబ్బా్‌సనగర్‌లోని రైతుబజార్‌లో సన్నబియ్యం కోసం ప్రజలు క్యూకట్టారు. ఎస్టేట్‌ అధికారి శివకుమార్‌, సెక్యూరిటీ గార్డులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూలో నిలబెట్టి అందరికి బియ్యాన్ని పంపిణీ చేశారు. శివకుమార్‌ మాట్లాడుతూ నగర ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం ధరణి పేరుతో రైస్‌ మిల్లర్లను సంప్రదించి తక్కువ ధరకే సన్నబియ్యం అందించే కార్యక్రమం చేపట్టిందన్నారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - Oct 28 , 2026 | 11:30 PM