Share News

నాణ్యంగా వైద్యసేవలు

ABN , Publish Date - Nov 13 , 2026 | 11:17 PM

సంజీవని కార్యక్రమం ద్వారా జిల్లాలోని అన్ని స్థాయిల ప్రభుత్వ ఆసుపత్రులను ఒకే డిజిటల్‌ వేదికపైకి అనుసంధానించి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్‌ రాజకుమారి వైద్యాధికారులను ఆదేశించారు.

నాణ్యంగా వైద్యసేవలు
వైద్యాధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల నూనెపల్లి, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి) : సంజీవని కార్యక్రమం ద్వారా జిల్లాలోని అన్ని స్థాయిల ప్రభుత్వ ఆసుపత్రులను ఒకే డిజిటల్‌ వేదికపైకి అనుసంధానించి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్‌ రాజకుమారి వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె తమ ఛాంబర్‌లో సంజీవని ఆరోగ్య సేవల సమగ్ర అమలు, పురోగతి, క్షేత్రస్థాయి కార్యాచరణపై వైద్యాధికారులతో జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. సంజీవని కార్యక్రమం అమలులో ప్రతి వైద్యాధికారి పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని, జిల్లాలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం కింద నిర్వహించే శిక్షణా కార్యక్రమాలను నిర్ణీత సమయంలో పూర్తి చేయడంతో పాటు అవి ఆచరణాత్మకంగా ఉండేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో 131 మంది వైద్యులు, 172 మంది స్టాఫ్‌ నర్సులు, 344 మంది కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లు, 533 మంది ఏఎన్‌ఎంలు, 1579 మంది ఆశా కార్యకర్తలు, 75 మంది మిడ్‌వైఫ్స్‌ భాగస్వాములు కానున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌ఓ ఇన్‌ఛార్జి డా. శారదాబాయి, డీసీహెచ్‌ఎ్‌స డా.లలిత, డీఈఓ జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2026 | 11:17 PM