Share News

నాణ్యమైన వైద్యసేవలే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Sep 13 , 2026 | 12:01 AM

గ్రామాల్లో రోగులకు నాణ్యమైన వైద్యసేవలందించడమే టీడీపీ ప్రభుత్వ ధ్యేయమని రోడ్లు భవనాల శాఖా మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు

నాణ్యమైన వైద్యసేవలే ప్రభుత్వ ధ్యేయం
ఆయుర్వేద వైద్యశాలను ప్రారంభిస్తున్న మంత్రి

మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి

బనగానపల్లె, సెప్టెంబరు 12( ఆరఽధజ్యోతి): గ్రామాల్లో రోగులకు నాణ్యమైన వైద్యసేవలందించడమే టీడీపీ ప్రభుత్వ ధ్యేయమని రోడ్లు భవనాల శాఖా మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. రూ.71లక్షలతో నిర్మించిన పది పడకల హంసానందసరస్వతి ఆయుర్వేద వైద్యశాలను మంత్రి శనివారం ప్రారంభించారు. పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు ఆయుర్వేద వైద్యసేవలు చేరువచ్యే అవకాశముందన్నారు. ఆసుపత్రికి అవసరమైన పంచకర్మ సామకూడా త్వరలో సమకూరుస్తామని, రోగులు వినియోగించుకోవాలన్నారు. రీజనల్‌ డిప్యూటీ డైరక్టర్‌ నాగముని నాయక్‌, వైద్యాధికారి వాణి, మాజీ సర్పంచ్‌ తులసిరెడ్డి, ఏఈ గర్జప్ప, నాగరాజు, శ్రీరాములు, లాయర్‌ మూర్తి పాల్గొన్నారు.

Updated Date - Sep 13 , 2026 | 12:01 AM