నాణ్యమైన భోజనం అందించాలి: కలెక్టర్
ABN , Publish Date - Feb 09 , 2026 | 11:34 PM
ప్రజల కు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ రాజకుమారి సూచిం చారు.
నంద్యాల నూనెపల్లి, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): ప్రజల కు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ రాజకుమారి సూచిం చారు. పట్టణంలోని కలెక్టరేట్ ఆవరణలో మె ప్మా ఆధ్వర్యంలో నిర్వహి స్తున్న తృప్తి క్యాంటీన్‌ను సోమవారం జేసీ కార్తీక్, జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం చేశారు. క్యాంటీన్‌లో అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత, వంట విధానం, ధరలు తదితర అంశాలపై సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. తృప్తి క్యాంటీన్లను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రజలకు నేరుగా ఉపయోగపడే ఈ తరహా సంక్షేమ కార్యక్రమాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యంగా ఉండకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మెప్మా పీడీని ఆదేశించారు.