నాణ్యమైన భోజనం పెట్టాలి
ABN , Publish Date - Jul 02 , 2026 | 11:23 PM
నాణ్యమైన ఆహారం అందించాలని ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్త విజయ్‌ప్రతా్‌పరెడ్డి ఆదేశించారు.
నాసిరకం కోడిగుడ్ల సరఫరాపై కలెక్టర్‌కు ఫిర్యాదు
పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన ఫుడ్ కమిషన్ చైర్మన్
హొళగుంద, జూలై 2 (ఆంధ్రజ్యోతి): నాణ్యమైన ఆహారం అందించాలని ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్త విజయ్‌ప్రతా్‌పరెడ్డి ఆదేశించారు. గురువారం మండలంలోని హెబ్బటం జెడ్పీ ఉన్నత పాఠశాల, ఇంగళదహాల్ బీసీ హాస్టల్‌తో పాటు హొళగుందలోని కేజీబీవీ పాఠశాల, జెడ్పీ ఉన్నత పాఠశాల, రేషన్ షాపులను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. కేజీబీవీ, జెడ్పీ ఉన్నత పాఠశాలలకు కోడిగుడ్లను సరఫరా చేస్తున్న గుత్తేదారు బరువు తక్కువగా ఉన్న గుడ్లు సరఫరా చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బరువు తూగే యంత్రంపై కోడిగుడ్డు బరువు చూడగా 34 గ్రాములు ఉంది. ఇలాంటి గుడ్లను సరఫరా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జెడ్పీ ఉన్నత పాఠశాలలో సుమారు వెయ్యికి పైగా ఉన్న పాడైపోయిన కోడిగుడ్లను వెంటనే కాంట్రాక్టర్‌కు పంపి నాణ్యమైన కోడిగుడ్లను తెప్పించుకోవాలని హెచ్‌ఎంను ఆదేశించారు. మధ్యా హ్న భోజనంలో నాణ్యత తగ్గితే 9966090123కు ఫోన్ చేస్తే స్పందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎ్‌సఓ రాజారఘువీర్, సివిల్ సప్లై గోదాము జిల్లా మేనేజర్ ఎన్. వెంకటరాముడు, తహసీల్దార్ లక్ష్మీరాజు, డీటీ నిజాముద్దీన్, ఆర్‌ఐ మహేష్, ఆలూరు సీడీపీఓ నరసమ్మ పాల్గొన్నారు.