Share News

నాణ్యమైన విద్య అందించాలి

ABN , Publish Date - Jun 26 , 2026 | 12:08 AM

ఏపీ ఉర్దూ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులను, ప్రిన్సిపాల్స్‌ను ఏపీ ఉర్దూ రెసిడెన్షియల్‌ ప్రభుత్వ సలహాదారుడు ఎంఏ షరీఫ్‌ పేర్కొన్నారు.

నాణ్యమైన విద్య అందించాలి
పాఠశాలలను పరిశీలిస్తున్న ఏపీ ఉర్దూ రెసిడెన్షియల్‌ ప్రభుత్వ సలహాదారుడు ఎంఏ షరీఫ్‌

ఏపీ ఉర్దూ రెసిడెన్షియల్‌ ప్రభుత్వ సలహాదారుడు ఎంఏ షరీఫ్‌

కర్నూలు ఎడ్యుకేషన్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): ఏపీ ఉర్దూ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులను, ప్రిన్సిపాల్స్‌ను ఏపీ ఉర్దూ రెసిడెన్షియల్‌ ప్రభుత్వ సలహాదారుడు ఎంఏ షరీఫ్‌ పేర్కొన్నారు. గురువారం స్థానిక కొత్తబస్టాండు సమీపంలో ఉన్న ఏపీ ఉర్దూ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలను ప్రభుత్వ సలహాదారుడు ఎంఏ షరీఫ్‌, టీడీపీ పార్టీ మైనార్టీ జనరల్‌ సెక్రటరీ బషీర్‌ అహ్మద్‌, పరిశీలించారు. ఈ సందర్బంగా ఎంఏ షరీఫ్‌ మాట్లాడుతూ మైనార్టీ విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు.

Updated Date - Jun 26 , 2026 | 12:08 AM