కొండచిలువ కలకలం ..
ABN , Publish Date - Nov 05 , 2026 | 12:19 AM
మండలంలోని బెలుం శింగవరం గ్రామంలో కొండచిలువ కలకలం రేపింది. బుధవారం ఉదయం గ్రామ వెలుపల ఉన్న పేరం మోహన్‌రెడ్డి ఇంటి ఆవరణలోకి వచ్చిన కొండచిలువ కోళ్లపై దాడి చేసింది
కొలిమిగుండ్ల, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బెలుం శింగవరం గ్రామంలో కొండచిలువ కలకలం రేపింది. బుధవారం ఉదయం గ్రామ వెలుపల ఉన్న పేరం మోహన్‌రెడ్డి ఇంటి ఆవరణలోకి వచ్చిన కొండచిలువ కోళ్లపై దాడి చేసింది. దీంతో కోళ్లు పెద్ద ఎత్తున అరుస్తూ పరుగులు తీశాయి. అప్పటికే ఏడు కోళను కొండచిలువ తిన్నట్లు ఇంటి యజమాని వాపోయాడు. కోళ్లను తిన్నాక కొండ చిలువ మత్తుగా అక్కడే పడిపోయింది. గ్రామస్థులు ఆటవీశాఖ అధికారులకు ఈ విషయం తెలయజేయడంతో వారు కొండచిలువను తీసుకవెళ్లి ఆడవిలో వదిలిపెట్టారు.