Share News

కందులను కొనుగోలు చేయండి

ABN , Publish Date - Jan 22 , 2026 | 11:02 PM

రైతులందరి నుంచి కందులను కొనుగోలు చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌ ఆదేశించారు. గురువారం మండలంలోని తిప్పాయపల్లె గ్రామంలో కొనసాగుతున్న కంది కొనుగోల్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జాయింట్‌ కలెక్టర్‌ వచ్చినా, అధికారులు కనిపంచపోవడాన్ని గమనించిన జేసీ మండిపడ్డారు.

కందులను కొనుగోలు చేయండి
తిప్పాయపల్లెలో రైతులతో మాట్లాడుతున్న జేసీ నూరుల్‌ ఖమర్‌

జేసీ నూరుల్‌ ఖమర్‌.. రైతులు ఫిర్యాదు చేయడంతో ఏవోపై ఆగ్రహం

ఓర్వకల్లు, జనవరి 22 (ఆంధ్రజ్యోతి):రైతులందరి నుంచి కందులను కొనుగోలు చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌ ఆదేశించారు. గురువారం మండలంలోని తిప్పాయపల్లె గ్రామంలో కొనసాగుతున్న కంది కొనుగోల్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జాయింట్‌ కలెక్టర్‌ వచ్చినా, అధికారులు కనిపంచపోవడాన్ని గమనించిన జేసీ మండిపడ్డారు. వ్యవసాయాధికారి మాత్రమే ఉన్నారని మిగతా సిబ్బతి ఎక్కడని ప్రశ్నించారు. తాము ఒక పంట సాగుచేస్తే, సిబ్బంది మరో పంట నమోదు చేస్తున్నారని రైతులు ఫిర్యాదు చేయడంతో, జేసీ వ్యవసాయాదికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ప్రభుత్వ భూముల్లో కంది పంట సాగుచేస్తే వాటిని కూడా మార్క్‌ఫెడ్‌ ద్వారా కర్నూలు మార్కెట్‌ యార్డులో ప్రభుత్వ రేటుకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని అక్కడి నుంచే జేసీ మార్క్‌ఫెడ్‌ అధికారులకు పోన్‌ చేసి సూచించారు. ఆందోళన చెందవద్దని, రైతులందరి నుంచి ప్రభుత్వం కందులను కొనుగోలు చేసి, రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తుందని జేసీ రైతులకు హామీ ఇచ్చారు. ఓర్వకల్లు సొసైటీ అధ్యక్షుడు సుధాకర్‌రావు, డైరెక్టర్‌ రాజశేఖర్‌, సుధాకర్‌రెడ్డి, ఏవో మధుమతి, రైతులు పాల్గొన్నారు.

అనంతరం ఓర్వకల్లులోని నందలి, అంజనా, గ్రామీణ విక్రత్‌ గ్యాస్‌ ఏజెన్సీ గోడౌన్‌ను జేసీ తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి డెలివరి బాయ్‌ ప్రవర్తన బిల్లులపై ధరలు పరిశీలించారు. గ్యాస్‌ ఏజెన్సీ ఆఫీసును పరిశీలించారు.

Updated Date - Jan 22 , 2026 | 11:02 PM