నేటి నుంచి పల్స్ పోలియో
ABN , Publish Date - Jun 27 , 2026 | 11:16 PM
జిల్లా వ్యాప్తంగా ఐదేళ్ల లోపు పిల్లలందరికీ ఆదివారం నుంచి మూడు దశల్లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ భాస్కర్ తెలిపారు.
కర్నూలు హాస్పిటల్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా ఐదేళ్ల లోపు పిల్లలందరికీ ఆదివారం నుంచి మూడు దశల్లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ భాస్కర్ తెలిపారు. శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా.ఉమాదేవితో కలిసి డీఎంహెచ్‌వో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో 3,52,164 మంది 0-5 ఏళ్లలోపు పి ల్లలు ఉన్నారని, 1,630 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 28న జిల్లా వ్యాప్తంగా ఏర్పాటుచేసిన బూత్‌లలో పోలియో చుక్కలు వే స్తామని, ఆరోజు ఏదైనా కారణంతో పోలియో చుక్కలు వేయించుకోని పిల్లలను గుర్తించి ఈ నెల 29, 30 తేదీల్లో వైద్యసిబ్బంది ఇంటింటా తిరిగి పోలియో చుక్కలు వేస్తారనీ వెల్లడించారు. కర్నూలు డివిజన్ డీఐవోగా డా.ఉమాదేవి, పత్తికొండ డివిజన్‌కు జిల్లా టీబీ ఆఫీసర్ డా.భాస్కర్, ఆదోని డివిజన్‌కు డిప్యూటీ డీఎంహెచ్‌వో డా.సత్యవతి పోలియో కార్య క్రమాన్ని పర్యవేక్షిస్తారన్నారు. సమావేశంలో డెమో ఎన్.ప్రకాష్‌రాజ్, హె ల్త్ ఎడ్యుకేటర్ పద్మావతి, హెల్త్ సూపర్‌వైజర్ శివ, ప్రొజెక్షనిస్టు ఖలీల్ పాల్గొన్నారు.