నేటి నుంచి పల్స్ పోలియో
ABN , Publish Date - Jun 27 , 2026 | 11:11 PM
జిల్లా వ్యాప్తంగా ఐదేళ్ల లోపు చిన్నారులకు ఆదివారం నుంచి పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిసు ్తన్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ పి, వెంకటరమణ తెలిపారు.
జిల్లాలో 2.38లక్షల మంది చిన్నారులు
605 కేంద్రాలు ఏర్పాటు
డీఎంహెచ్‌వో వెంకటరమణ
నంద్యాల టౌన్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా ఐదేళ్ల లోపు చిన్నారులకు ఆదివారం నుంచి పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిసు ్తన్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ పి, వెంకటరమణ తెలిపారు. శనివారం కార్యాలయం నుంచి సాయిబాబానగర్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహిం చారు. ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 605 కేంద్రాల్లో 2.38లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయ డానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు 605 మంది ఏఎన్‌ఎంలు, 369 మంది ఎంఎల్‌హెచ్‌పీలు, 1595 ఆశా కార్యకర్తలతో పాటు ఆరోగ్య సిబ్బం దిని నియమించామన్నారు. ప్రతి ఐదేళ్ల లోపు చిన్నారులకు తప్పని సరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులను కోరారు. కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్ డాక్టర్ లలిత, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, ప్రోగ్రాం అధికారి కాంతారావ్ నాయక్, డాక్టర్లు శ్రీనివాసులు, లక్ష్మిప్రసన్న, డిప్యూటీ డీఈఎంవో పామన్న తదితరులు పాల్గొన్నారు.