2,24,355 మందికి పల్స్ పోలియో
ABN , Publish Date - Jun 28 , 2026 | 11:31 PM
జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమంగా విజయవంతంగా సాగింది. తొలిరోజైన ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఎక్కడిక్కడ సిబ్బంది ఉదయం 7 గంటల నుంచే విధుల్లో నిమగ్నమయ్యారు.
తొలిరోజే 97శాతం నమోదు
10 మంది ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ
నేడు, రేపు ఇంటింటికి పల్స్ పోలియో
నంద్యాల, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమంగా విజయవంతంగా సాగింది. తొలిరోజైన ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఎక్కడిక్కడ సిబ్బంది ఉదయం 7 గంటల నుంచే విధుల్లో నిమగ్నమయ్యారు. కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ, పల్స్ పోలియో రాష్ట్ర ప్రత్యేక అధికారి డాక్టర్ రమేష్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్డర్ వెంకటరమణ పర్యవేక్షణలో ఎక్కడిక్కడ పల్స్ పోలియో కార్యక్రమం వేగవంతగా సాగింది. అంతేకాకుండా 10 మంది ప్రత్యేక అధికారులు(పోగ్రామ్ ఆఫీర్లు) సైతం తమ పరిధిలోని ప్రాంతాల్లో సిబ్బందిని అప్రమత్తం చేశారు. తద్వారా ఒక్కరోజులోనే జిల్లా వ్యాప్తంగా 2,24,355 మంది చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. ఒక్కరోజులోనే 97శాతానికి పైగా నమోదైనట్లైంది. ఇక మిగిలిన 4579 మంది చిన్నారులకు ఇంటింటికి నేడు, రేపు సిబ్బంది వెళ్లి పోలియో చుక్కలు వేయనున్నారు.
10 మంది ప్రత్యేక అధికారులచే..
రాష్ట్ర పల్స్ పోలియో ప్రత్యేక అధికారి డాక్డర్ రమేష్, జిల్లా వైద్య ఆరోగ ్యశాఖాఽధికారి డాక్డర్ వెంకటరమణ నేతృత్వంలో ఎక్కడిక్కడ 10 మంది ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో సాగింది. జిల్లా వ్యాప్తంగా 0-5 ఏళ్ల పిల్లలు మొత్తంగా 2,28,934 మంది ఉండగా.. వీరిలో 2,24,355 మందికి పోలియో చుక్కలు వేసినట్లు అధికార లెక్కలు చెప్తున్నాయి. మిగిలిన 4579 మంది చిన్నారులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చిన పిల్లలు ఎవరైనా ఉంటే వారికి కూడా ఆయా బూత్ స్థాయి సిబ్బంది ఇంటింటికి నేడు, రేపు వెళ్లి పోలియో చుక్కులు వేయనున్నారు. ప్రధానంగా ప్రత్యేకంగా గుర్తించిన 46 బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలోను చిన్నారులకు సిబ్బంది పోలియో చుక్కలు వేశారు. తొలిరోజు ఒక్కరోజులోనే జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో 97శాతానికి పైగా జరిగినట్లైంది.
ఇంటింటికి సిబ్బంది
0-5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి. తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని గ్రహించాలి. మిగిలిన 4579 మంది చిన్నారులకు నేడు, రేపు సిబ్బంది ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేస్తారు.
డాక్టర్ వెంకటరమణ, డీఎంహెచ్‌వో
చిన్నారులకు రెండు చుక్కలు
పల్స్ పోలియోతో చిన్నారులకు బంగారు భవిత
ఎంపీ బైరెడ్డి శబరి
నంద్యాల టౌన్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి) : రెండు పోలియో చుక్కలు చిన్నారుల బంగారు భవితకు ఎంతో అవసరమని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి, కలెక్టర్ రాజకుమారి పిలుపునిచ్చారు. ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా ఎన్జీవోస్ కాలనీ యూపీహెచ్‌సీ ఎంపీ, మూలసాగరంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కలెక్టర్ రాజకుమారి పల్స్ పోలియో ప్రారంభించారు. వారు మాట్లాడుతూ దేశంలో పోలియో రహిత దేశఽంగా ఉన్నప్పటికీ చుట్టు పక్కన దేశాల్లో అక్కడక్కడ కేసులు నమోదు అవుతున్నాయన్నారు. దీంతో ఏడాదికి రెండు సార్లు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐదేళ్ల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలన్నారు. జిల్లాలో 2.38 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు అందజేశామన్నారు. ప్రయాణంలో ఉన్నా చిన్నారుల కోసం బస్టాండ్లు, రైల్వేస్టేషన్‌లలో కూడా పోలియో చుక్కల కేంద్రాలు అందుబాటులో ఉంచామన్నారు. ి పోలియో కేంద్రాలకు వెళ్లలేని వారికోసం ఈనెల 29, 30 వతేదీలలో సిబ్బంది ద్వారా పోలియో చుక్కలు వేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటరమణ, మున్సినల్ కమిషనర్ బండి శేషన్న, అడిషనల్ డీఎంహెచ్‌వో శారదాబాయి, ప్రోగాం అధికారులు సుదర్శన్‌బాబు, డాక్టర్ లక్ష్మిప్రసన్న తదితరులు పాల్గొన్నారు.