ప్రజా శ్రేయస్సే టీడీపీ ధ్యేయం
ABN , Publish Date - Jul 29 , 2026 | 12:24 AM
ప్రజా శ్రేయస్సే తెలుగుదేశం పార్టీ ధ్యేయమని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం
ఓర్వకల్లు, జూలై 28(ఆంధ్రజ్యోతి): ప్రజా శ్రేయస్సే తెలుగుదేశం పార్టీ ధ్యేయమని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని కొమరోలు, సోమయాజులపల్లె గ్రామాల్లో కూటమి ప్రభు త్వం రెండేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించారు. ఇంటింటికీ టీడీపీ కార్యక్రమానికి ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, టీటీడీ బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్‌లు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కొమరోలులో రూ35 లక్షలతో నూతనంగా నిర్మించిన సిమెంటు రోడ్డు, ప్రజల కోసం నిర్మించిన విలేజ్ క్లినిక్‌లను సోమయాజులపల్లె, కొమరోలు పూజలు చేసి ఆమె ప్రారంభించారు. ఎమ్మెల్యే ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల సమాచార పత్రాలను అందిస్తూ ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో నాగ అనసూయ, ఏవో మధుమతి, పంచాయతీ రాజ్ ఇంజనీర్ సురేంద్రనాథ్ రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు సుధాకర్‌రావు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గోవిందరెడ్డి, మండల కన్వీనర్ బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, మాజీ ఎంపీపీ లక్ష్మణరావు, ట్రెజరర్ మహబూబ్ బాషా, నాయకులు రాంభూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరికీ సంక్షేమ పథకాలు: ఎమ్మెల్యే దస్తగిరి
సి.బెళగల్: అర్హులందరికీ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుందని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. మంగళ వారం మండలంలోని గొల్లలదొడ్డి గ్రామంలో మండల టీడీపీ కన్వీనర్ చంద్రశేఖర్ అధ్యక్షతన ఇంటింటికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే దస్తగిరి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ లన్నీ వరుసగా నెరవేరుస్తున్నారన్నారు. జిల్లా ముస్లిం మైనార్టీ నాయకుడు దూద్‌వలి, సింగిల్ విండో ప్రెసిడెంటు తిమ్మప్ప, కూటమి నాయకులు వెంకటేశ్వర గౌడు, జగనరెడ్డి, ఫరూర్ బాషా, దస్తగిరి పాల్గొన్నారు.
కల్లూరు: కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాల నపై ప్రజలు పూర్తిస్థాయిలో హర్షం వ్యక్తం చేస్తున్నారని పాణ్యం టీడీపీ యువ నాయకుడు గౌరు జనా ర్దనరెడ్డి అన్నారు. మంగళవారం కల్లూరు మండలం పుసులూరులో ఇంటిం టికీ తిరిగి ఆయన కరపత్రాలను పంపిణీ చేశారు. ఉలిందకొండ సింగిల్ విండో అధ్యక్షుడు ఈవీ రమణ, వాకిటి మాదేష్, బాషా పాల్గొన్నారు.
కర్నూలు అర్బన్: కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని టీడీపీ ఎస్సీసెల్ నాయకులు కాసపోగు గిడ్డన్న అన్నారు. మంగళవారం నగరంలోని 55వ బూతలోని ఓటర్లను కలిసి ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందించారు. కార్యక్రమంలో నాయకులు కే.ఏసన్న, ఈశ్వరయ్య, సురేష్ బాబు, అన్వర్‌బాషా, తాహిర్ బాషా పాల్గొన్నారు.