ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - May 01 , 2026 | 11:03 PM
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ పేర్కొన్నారు.
న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్
నంద్యాల రూరల్, మే 1 (ఆంధ్రజ్యోతి): ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని 39 వవార్డులో నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి, కలెక్టర్ రాజకుమారితో కలిసి పెన్షన్లు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రజల సమగ్రాభివృద్ధి, సంక్షేమమే ప్ర భుత్వ ప్రధాన లక్ష్మమన్నారు. కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,11,468 మంది లబ్దిదారులకు సుమారు రూ92 కోట్ల పెన్షన్ మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. జిల్లాలో సుమారు 4,500మంది సిబ్బంది ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఎంపీ బైరెడ్డి శబరి మాట్లాడుతూ ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటీకీ ప్రతినెల 1వ తేదీన పెన్షన్‌లు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం పని చేస్తుందన్నారు.