Share News

కూటమి పాలనకు ప్రజాదరణ

ABN , Publish Date - Jun 21 , 2026 | 12:18 AM

రాష్ట్రంలో రెండేళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం ప్రజాదరణ పొందిందని టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అన్నారు.

కూటమి పాలనకు ప్రజాదరణ
మాట్లాడుతున్న టీడీపీ ఆలూరు ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి

ఉనికి కోసం గొడ్డలి పార్టీ నాయకుల పాకులాట

ఎమ్మెల్యే విరుపాక్షిని ప్రజలు నిలదీయాలి

కూటమి విజయోత్సవ సభలో

టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ

ఆలూరు, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రెండేళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం ప్రజాదరణ పొందిందని టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అన్నారు. శనివారం ఆలూరు పట్టణంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనపై విజయోత్సవ సభను టీడీపీ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో నిర్వహించిన సమావేశంలో గుడిసె కృష్ణమ్మ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ పథకాల్లో ఐదు హామీలు కూటమి ప్రభుత్వం అమలు చేసిందన్నారు. పింఛన్ల పెంపు, రూ.5 లక్షల ఉద్యోగాల భర్తీ, అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించారన్నారు. మహిళలకు ఉచిత గ్యాస్‌, బస్సు ప్రయాణం కల్పించి ప్రజాదరణ పొందారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో సీఎం చంద్రబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ మంత్రి నారా లోకేష్‌ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతున్నదని అన్నారు. ప్రజలకు మేలు చేస్తున్న కూటమి ప్రభుత్వంపై ప్రతిపక్ష హోదా కూడా లేని గొడ్డలి పార్టీ నాయకులు తమ ఉనికి కోసం రోడ్లెక్కి వెన్నుపోటు కార్యక్రమాన్ని నిర్వహించడం సిగ్గుచేటన్నారు. ఆలూరు ఎమ్మెల్యేగా ఉన్న విరుపాక్షిని ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే నియోజకవర్గ సమస్యలను ఒక రోజైనా అసెంబ్లీలో ప్రస్తావించారా? ఆయనను ప్రజలు నిలదీయాలని అన్నారు. టీడీపీ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఆలూరు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. తాను ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టాక రూ.300కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఆలూరు ప్రాంత ప్రజల చిరకాల కోరిక వేదవతి ప్రాజెక్టు నిర్మాణం మూడేళ్లలో పూర్తవుతుందన్నారు. అనంతరం జనసేన ఇన్‌చార్జి వెంకప్ప మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ నాయకత్వంలో రాష్ట్రంలో రహదారులు బాగుపడ్డాయన్నారు. టీడీపీ నేత వైకుంఠం శివప్రసాద్‌, ఆలూరు పరిశీలకుడు ఆదినారాయణ, కమ్మ కార్పొరేషన్‌ స్టేట్‌ డైరెక్టర్‌ పోలినేని సూర్యనారాయణ, బీజేపీ నాయకులు విట్టా రమేష్‌, వెంకటరాముడు, తిమ్మప్ప, టీడీపీ నాయకులు కురువ జయరాం, మీనాక్షినాయుడు, మార్కెట్‌యార్డు చైర్మన్‌ వెంకటేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 21 , 2026 | 12:18 AM