Share News

మావిగనకు ప్రజల మద్దతు

ABN , Publish Date - Apr 16 , 2026 | 12:33 AM

మావిగనకి ప్రజల మద్దతు ఉందని, టీడీపీ మంత్రులు బహిరంగంగా వైసీపీ నాయకు లపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహనరెడ్డి అన్నారు.

మావిగనకు ప్రజల మద్దతు
మాట్లాడుతున్న ఎస్వీ మోహనరెడ్డి

వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహనరెడ్డి

కర్నూలు న్యూసిటీ, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): మావిగనకి ప్రజల మద్దతు ఉందని, టీడీపీ మంత్రులు బహిరంగంగా వైసీపీ నాయకు లపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహనరెడ్డి అన్నారు. బుధవారం ఎస్వీ కాంప్లెక్స్‌లోని సమావేశ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డారు. గృహనిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి వ్యాఖ్యలను వైసీపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. మావిగన దెబ్బకు టీడీపీ మంత్రులకు చెమటలు పడు తున్నాయన్నారు. కర్నూలులోని సాయి స్పోర్ట్స్‌ అథారిటీనీ తిరుపతికి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, దీనిపై మంత్రి భరత స్పందించాలన్నారు. ఈసమావేశంలో నాయకులు రాంపుల్లయ్య యాదవ్‌, గడ్డం రామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2026 | 12:33 AM