‘స్వచ్ఛత’లో ప్రజలే కీలకం
ABN , Publish Date - Sep 20 , 2026 | 12:17 AM
జిల్లాలో పారిశుధ్య నిర్వహణకు అధికార యంత్రాంగం వినూత్న ప్రయత్నాలు చేస్తోందని, ఇందులో ప్రజల పాత్ర కీలకమని కలెక్టర్, నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారి డా.ఏ. సిరి అన్నారు.
కర్నూలు న్యూసిటీ, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పారిశుధ్య నిర్వహణకు అధికార యంత్రాంగం వినూత్న ప్రయత్నాలు చేస్తోందని, ఇందులో ప్రజల పాత్ర కీలకమని కలెక్టర్, నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారి డా.ఏ. సిరి అన్నారు. శనివారం స్వచ్ఛత హీ సేవ, స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా కేసీ కెనాల్ వినాయక ఘాట్ వద్ద కమిషనర్ చల్లా ఓబులేసు, ఆర్‌డీఓ సందీ్‌పకుమార్‌లతో కలిసి స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అధికారులు, సిబ్బందితో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. నగరాన్ని పరిశుభ్రంగా, అందంగా ఉంచడంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం కీలకమన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం ప్రతి ఏటా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు జరుగుతుందన్నారు. గార్గేయపురం డంప్‌యార్డులో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్, ఇంటిగ్రేడెట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్లను పూర్తి చేస్తామన్నారు. కమిషనర్ చల్లా ఓబులేసు మాట్లాడుతూ స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా నగరంలో నెల రోజులు స్వచ్ఛత కార్యక్రమాలను నిర్వహించామన్నారు. ప్రజారోగ్య అధికారి డా.ఎం. రఘు, శానిటరీ సూపర్‌వైజర్ రమే్‌షబాబు, ఇన్‌స్పెక్టర్లు ఫరూక్, జిలానీ, స్వచ్ఛ సర్వేక్షన్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.