Share News

ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి

ABN , Publish Date - Jun 06 , 2026 | 11:27 PM

ప్రజాసమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనా ర్దన్‌రెడ్డి సూచించారు.

ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి
బనగానపల్లెలో అర్జీలు స్వీకరిస్తున్న మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

బనగానపల్లె, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): ప్రజాసమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనా ర్దన్‌రెడ్డి సూచించారు. బనగానపల్లెలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల, టీడీపీ నాయ కులు, కార్యకర్తల అర్జీలను మంత్రి స్వీకరించారు. పలు అర్జీలను స్వయంగా చదివి సంబంఽధిత అధికారులకు ఫోన్‌ చేసి సమస్యలను పరిష్కరించారు. మంత్రి బీసీ మాట్లాడుతూ రెవెన్యూ, ఇతర సమస్యలకు సంబంధించిన అర్జీలను అధికారులు త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అధికారులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని చెప్పారు.

Updated Date - Jun 06 , 2026 | 11:27 PM