Share News

ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి

ABN , Publish Date - Jul 17 , 2026 | 11:25 PM

ప్రజల సమస్యలను ఎప్పటి కప్పుడు పరిష్కరించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సూచించారు.

ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి
ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న బీసీ జనార్దన్‌రెడ్డి

మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి

బనగానపల్లె, జూలై 17(ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్యలను ఎప్పటి కప్పుడు పరిష్కరించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సూచించారు. పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం గ్రీవెన్స్‌ నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి ప్రజలు, బాధితులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అఽధికారులు మంత్రి క్యాంపు కార్యాల యానికి తరలివచ్చి సమస్యలను మంత్రికి విన్నవించారు. ప్రజలు, బాధి తుల వినతులు స్వీకరించి అప్పుటికప్పుడే కొన్ని సమస్యలను అధికా రులకు ఫోన్‌ చేసి పరిష్కరించారు. కొన్ని సమస్యలను సంబంధిత శాఖ లకు పంపి పరిష్కరించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. పొలం వివాదాలు, వ్యక్తిగత సమస్యల గురించి ప్రజలు మంత్రి దృష్టికి తీసు కువచ్చారు. ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పవద్దని, అలాంటి అఽధికా రులపై చర్యలు తీసుకుంటామన్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించి ప్రజలకు సేవలందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సమ స్యల పరిష్కారానికి అధికారులు సమష్టిగా పనిచేయాలని సూచించారు.

Updated Date - Jul 17 , 2026 | 11:25 PM