Share News

ప్రజా సమస్యలను పరిష్కరించాలి: మంత్రి బీసీ

ABN , Publish Date - Jun 15 , 2026 | 11:46 PM

ప్రజాసమస్యలపై వచ్చే వినతులను అధికారులు ఎప్పటికప్పుడు స్పందించి పరిష్కరించి ప్రజలకు సేవలందించాలని రోడ్లు భవనాల శాఖా మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి కోరారు.

ప్రజా సమస్యలను పరిష్కరించాలి: మంత్రి బీసీ
అర్జీలను స్వీకరిస్తున్న మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

బనగానపల్లె, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): ప్రజాసమస్యలపై వచ్చే వినతులను అధికారులు ఎప్పటికప్పుడు స్పందించి పరిష్కరించి ప్రజలకు సేవలందించాలని రోడ్లు భవనాల శాఖా మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి కోరారు. సోమవారం బనగానపల్లె పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాల యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల, టీడీపీ నాయకుల, కార్యకర్తల అర్జీలను స్వయంగా స్వీకరించారు. ఈ సంద ర్భంగా మంత్రి పలు అర్జీలను స్వయంగా సంబంఽధిత అధికారులకు ఫో న్లు చేసి పరిష్కరించారు. రెవిన్యూ, ఇతర సమస్యలను అధికారులు కార్యా లయాల చుట్టూ తిప్పకుండా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాల కల్పనకు సత్వర చర్యలు తీసుకో వాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్ళాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. అర్జీలను పరిష్కరించడానికి కృషి చేసిన మంత్రి బీసీని ప్రజలు అభినందించారు.

Updated Date - Jun 15 , 2026 | 11:46 PM