ప్రజా సమస్యలను పరిష్కరించాలి
ABN , Publish Date - Aug 10 , 2026 | 11:31 PM
ప్రజా సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు చిత్తశుద్ధితో పరిష్కరించి ప్రజల మన్ననలు పొందాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.
మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
బనగానపల్లె, జూలై 10 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు చిత్తశుద్ధితో పరిష్కరించి ప్రజల మన్ననలు పొందాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. బనగానపల్లెలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారం ఉదయం ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, కూటమి నాయకుల నుంచి అర్జీలు స్వీకరించారు. పలు అర్జీలను పరిశీలించి అధికారులకు ఫోన్‌లు చేసి సమస్యలను పరిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ రెవె న్యూ, ఇతర సమస్యలకు సంబంధించిన అర్జీలను అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షే మం, అభివృద్ధి కార్యక్రమాలను అధికారులు ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై వచ్చే అర్జీలను అఽధికారులు ఆలస్యం చేయకూడదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని అన్నారు.