ప్రభుత్వానికి ప్రజలే ముఖ్యం
ABN , Publish Date - Feb 01 , 2026 | 12:51 AM
ప్రభుత్వానికి ప్రజలే ముఖ్యమని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. శనివరాం 52వ వార్డు కొండారెడ్డి బురుజు సమీపంలో 15 మంది లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు.
మంత్రి టీజీ భరత్, నగరంలో పింఛన్ల పంపిణీ
కర్నూలు న్యూసిటీ, జనవరి 31(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వానికి ప్రజలే ముఖ్యమని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. శనివరాం 52వ వార్డు కొండారెడ్డి బురుజు సమీపంలో 15 మంది లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. మంత్రి ఇంటింటికి వెళ్లి అప్యాయంగా పలకరించి ప్రజల యోగక్షేమాలు విచారించారు. మాల శ్రీనివాసులు, చిన్న ఖాసింకు దివ్యాంగుల పెన్షన్..మీనాక్షి, నాగమణిలకు వితంతు, ఇతరులకు వృద్దాఫ్య, ఒంటరి మహిళల పెన్షనర్లను పంపణీ చేశారు. ఒకటో తారీఖు సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్ ఇస్తున్నామన్నారు. నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ సతీ్‌షకుమార్‌రెడ్డి, వార్డు టీడీపీ సీనియర్ నాయకులు బి.శ్రీనివాసులు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు అర్బన్: నగరంలో కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, డీసీఎంఎస్ చైర్మన్, కార్పొరేషన్ల డైరెక్టర్లు పింఛన్లను పంపిణీ చేశారు. 32వ వార్డులో డీసీఎంఎస్ చైర్మన్ వై,నాగేశ్వరరావు యాదవ్, 42వ వార్డులో టీడీపీ జిల్లా ప్రఽధాన కార్యదర్శి నాగరాజు యాదవ్, 46వ వార్డులో వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ సంజీవ లక్ష్మి పంపిణీ చేశారు.
సి.బెళగల్: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చామని ఎమ్మెల్యే దస్తగిరి అన్నారు. శనివారం మండలంలోని బురాన్‌దొడ్డి గ్రామంలో విద్యాకమిటీ చైర్మన్ డిస్‌వెంకటేశ్‌తో కలిసి ఎమ్మెల్యే పింఛన్లను పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజా సమస్యలపట్ల నిర్లక్ష్యం వహించకుండా పరిస్కరించాలని అధికారులను కోరారు. అనంతరం జడ్పీ పాఠశాలను తనికీ చచేసి, పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. ఇష్టంతో చదివితే అనుకున్నది సాధించగలరన్నారు. ఎంపీడీవో రాణెమ్మ, నాయకులు అమర్, మండలకన్వినర్ చంద్రశేఖర్, బాలజివెంకటేశ్, భీమన్న, కొత్తకోట హారి ఉన్నారు.